Wednesday, September 24, 2025

స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర కనపడుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించేలోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్టే అని, గ్రామపంచాయతీల వారీగా కుల గణన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. బిసి రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తున్నదని, రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News