హైదరాబాద్: గ్రూప్-1 విషయంలో టిజిపిఎస్‌సికి (TGPSC) హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సిజె పేర్కొన్నారు.
గ్రూప్-1 మెయిన్స్ పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని ఈ నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఎనిమిది నెలల్లో మెయిన్స్ పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని టిజిపిఎస్‌సికి (TGPSC) ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎనిమిది నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని పేర్కొంది. టిజిపిఎస్‌సి విడుదల చేసిన గ్రూప్-1 జిఆర్‌ఎల్‌ను జస్టిస్ రాజేశ్వరరావు రద్దు చేశారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పు రద్దు కోరుతూ టిజిపిఎస్‌సి హైకోర్టులో అప్పీలు చేసింది. టిజిపిఎస్‌సితో పాటు ఎంపికైన అభ్యర్థులు కూడా అప్పీలు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విని సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.
Also Read : ‘గ్రూప్-1 తీర్పు’పై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు