- Advertisement -
హైదరాబాద్: మెడిసిన్ చదవడం ఇష్టం లేక టాప్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనురాగ్ అనిల్ బోకర్ అనే విద్యార్థి నీట్ ఎగ్జామ్లో 99.9 శాతం మార్కులు వచ్చాయి. నీట్ లో ఒబిసి కేటగీరిలో 1475 ర్యాంకు సాధించాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ ప్రాంతంలో ఓ ఎంబిబిఎస్ కాలేజీలో అడ్మిషన్ పొందేటందుకు వెళ్తుండగా అతడు ఇంట్లోనే ఉరేసుకున్నాడు. తాను వైద్య వైద్య అభ్యసించడం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?
- Advertisement -