Thursday, September 25, 2025

వెంకట్ గౌడ్ కన్నుమూత… కెటిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘వొడువని ముచ్చట’,‘నీళ్ల ముచ్చట’ పుస్తకాలు ‘సర్వాయి పాపన్న చరిత్ర‘ ను రాశారు. రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంతాపం తెలిపారు. రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం బాధాకరం అని, తెలంగాణ మట్టిబిడ్డ కొంపల్లి వెంకట్ ఇక లేరన్న వార్త దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్నారు. కొంపల్లి వెంకట్ హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటు అని, ఇద్దరు మహానుభావుల ఆలోచనలను పుస్తకరూపంలో పదిలపరిచారని కెటిఆర్ పేర్కొన్నారు.

Also Read : యాదగిరిగుట్టకు తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News