ఓజి సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో చిత్ర బృందానికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. టికెట్ల ధరలు 26వ తేదీ వరకు పెంచుకోవచ్చని హైకోర్టు డివిజనల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మెమోను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మూవి యూనిట్ హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన డివిజనల్ బెంచ్ శుక్రవారం వరకు స్టే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా బెటిఫిట్ షో, టికెట్ ధరలను పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారిణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం మెమోను సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిత్ర బృందం హై కోర్టు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రస్తుతం రెండు (25,26) రోజుల వరకు మాత్రమే పరిమితం కావడంతో ఈ విషయంలో కోర్టు తదుపరి నిర్ణయం ఏవిధంగా ఉంటుందో అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ఓజి సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -