Friday, September 26, 2025

ఐరాసలో చేదు అనుభవాలు.. సీక్రెట్ సర్వీస్ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్/వాషింగ్టన్: ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడానికి వెళ్లినప్పుడు తనకు మూడు రకాల చేదు అనుభవాలు ఎదురయ్యాయని, వాటిపై విచారణ జరపాల్సిందిగా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఐరాసలో మరో అంతస్తుకు ఎక్కేందుకు వెళ్తుండగా ఎస్కలేటర్ ఆగిపోయింది మొదటిది కాగా, ఆ తర్వాత టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడం రెండోది అని, ఇక మూడోది ఆడిటోరియంలో సౌండ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో వివరించారు. ఇన్నిఆటంకాలు ఎదురైనా తన ప్రసంగానికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి అని పేర్కొన్నారు. ఇక ఆడిటోరియం లోని సౌండ్ సిస్టమ్ ఘోరంగా ఉందని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడిన తరువాత భార్య మెలానియా వైపు చూడగా, ఆమె ఒక్కముక్క కూడా వినిపించలేదని పేర్కొన్నారని చెప్పారు. ఇది ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కాదని, ఈ మూడూ ఉద్దేశ పూర్వకంగా చేసినవే అని ట్రంప్ ఆరోపించారు.

ఈ లోపాలపై దర్యాప్తు చేపట్టాలని ఐరాస సెక్రటరీ జనరల్‌కు లేఖ రాస్తానని అనారు. ఇందులోసీక్రెట్ సర్వీస్‌ను భాగస్వామి చేయాలన్నారు. భార్య మెలానియాతో కలిసి సర్వప్రతినిధి సభకు వచ్చిన ఆయన సమావేశ ప్రాంగణానికి చేరుకునేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. వారిద్దరూ అడుగుపెట్టగానే హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో ట్రంప్ దంపతులు తూలినట్లయ్యారు. తదేకంగా ఒకవైపు చూస్తూ మెలానియా కాస్త మెట్లెక్కి వెళ్లారు. ఆమెను ట్రంప్ అనుసరించారు. తనకు ఎదురైన అనుభవనాలను ఐరాస ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావించారు. ‘ఒకటి చెత్త ఎస్కలేటర్. రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్. మరొకటి సౌండ్ సిస్టమ్. థాంక్యూ వెరీమచ్’ అంటూ వ్యంగ్యంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

Also Read: హద్దుమీరితే కూల్చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News