Friday, September 26, 2025

రైలు బోల్తా… ఏడుగురు బౌద్ధ సన్యాసుల మృతి

- Advertisement -
- Advertisement -

కొలంబో: వాయువ్య శ్రీలంకలో బుధవారం రాత్రి కేబుల్‌ఆపరేటెడ్ రైలు బండి బోల్తాపడి భారతీయ బౌద్ధ సన్యాసితోపాటు మొత్తం ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొలంబోకు 125 కిమీ దూరంలో నికవేరతీయ లోగల అటవీ బౌద్ధ మఠం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మఠానికి ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ సన్యాసులు ధ్యానం ఆచరించడానికి వస్తుంటారు. మృతుల్లో ఒక భారతీయుడు, రష్యన్, రొమానియన్ ఉన్నారు. గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి క్లిష్టంగా ఉందని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News