Friday, September 26, 2025

త్వరలో ట్రంప్-మోడీ భేటీ!

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ మధ్య అత్యంత సానుకూల అనుబంధం ఉందని, వచ్చే క్వాడ్ సదస్సులో ఇద్దరూ భేటీ అవుతారని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2026 ప్రారంభంలో భారత్‌లో క్వాడ్ సదస్సు జరిగే అవకాశం ఉంది. ఈ సదస్సులో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ నిర్ణయించింది. అమెరికా భారత్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చల గురించి ప్రస్తావిస్తూ అత్యంత ఉత్పాదకతతో ఉంటున్నాయని, సానుకూల ఫలితాలు కొనసాగుతాయన్న ఆశాభావం వెలిబుచ్చారు. తమలో విభేదాలున్నా గత కొన్ని వారాలుగా తొలగిపోయాయని, ఇక వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు తదితర అంశాల్లో నెలకొన్న బేధాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News