Friday, September 26, 2025

రాబోయే రోజుల్లో హర్యానాలో ఐఎన్‌ఎల్‌డీ అధికారంలోకి రాబోతుంది

- Advertisement -
- Advertisement -

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ 112వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో హర్యానాలో ఐఎన్‌ఎల్‌డీ అధికారంలోకి రాబోతుందనే విశ్వాసం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపిని హర్యానా గద్దె దించే సమయం ఆసన్నమైందని చెప్పారు. హర్యానాలో వ్యవసాయానికి ఇచ్చే కరెంట్‌పై 35 శాతం ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. అభయ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేయాలని సూచించారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందని గుర్తు చేశారు. అభయ్ నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. దేవీలాల్‌ను ఉత్తరభారతీయులే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతి రైతు ప్రేమిస్తారని అన్నారు. దేవీలాల్ తన రాజ్ఞనీత్ఞతతో రైతుల కోసం చాలా చేశారని, దీనిపై దక్షిణభారతంలోనూ చర్చిస్తారని తెలిపారు.

మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన కవిత
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూడు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఖతార్, మాల్టా, లండన్‌లలో జరగనున్న వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఆమె, హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ నుంచి ఖతార్‌కు బయలుదేరి వెళ్లారు. 26న ఖతార్‌లో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు. 27న మల్టాకు చేరుకొని తెలంగాణ జాగృతి మాల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, 28న లండన్‌కు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.

Also Read: ఆర్‌టిసి బస్సెక్కితే బహుమతులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News