హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, మణికొండ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పలు చోట్ల రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం కావడంతో తెలంగాణలో కూడా మూడు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. శుక్రవారం వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.