Friday, September 26, 2025

అన్నవరం ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రత్నగిరి పడమర రాజ గోపురం ఎదురుగా గల దుకాణల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు నిర్వాహకులు, ఆలయ సెక్యూరిటీ  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపకయంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఐదు దుకాణాలు కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరగగా ప్రాణం నష్టం జరగలేదు.  ఈ ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమని ఆలయ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Also Read: బాలికను తుపాకీతో కాల్చి… ప్రేమోన్మాది ఆత్మహత్య

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News