Friday, September 26, 2025

కిషన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం: మహేష్ కుమార్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముద్దాయిగా నిరూపించబడ్డారని శిక్ష తప్పదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫార్ములా- ఈ కార్ రేసులో కెటిఆర్ తప్పు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూసి సుందరీకరణను బిఆర్ఎస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు అని సూచించారు. తెలంగాణకు కిషన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. కేంద్రం దగ్గర బిసి బిల్లు ఎందుకు పెండింగ్ లో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రయత్నిస్తే బిసి బిల్లు ఆమోదం పొందుతుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Also Read : కాళేశ్వరంపై సిబిఐ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News