Friday, April 26, 2024

ఫ్రీజవుతున్న పిల్లలు.. భూకంపంతో విలవిల

- Advertisement -
- Advertisement -

గజియాన్‌టెప్ : టర్కీ నగరాలు గజియాన్‌టెప్, కహ్రాయనమారస్ మధ్య ప్రధాన కేంద్రంగా తలెత్తిన టర్కీ సిరియా భూకంపం తరువాతి పరిణామాలు బాలలకు శాపంగా మారాయి. ఇక్కడ వీధులలోకి తరలివచ్చిన కుటుంబాలు తమ పిల్లలు గడ్డకట్టుకుపోయే శీతల పరిస్థితుల మధ్య ఉండటంతో, దాదాపుగా వారి శరీరాలు ఫ్రీజ్ అవుతున్న దశకు చేరుకోవడంతో తల్లడిల్లుతున్నాయి. ఇప్పటికీ తన సోదరుడి జాడ లేదని ఓ వ్యక్తి వాపోతూ ఉంటే, మరో మహిళ తన కుటుంబం కనపడకుండా పోయిందని, శిథిలాల కింద నలిగిపోయి ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది.

భూకంపం తరువాత ఇన్ని గంటలకు కూడా ప్రభుత్వ అధికారులు కానీ సహాయక సిబ్బంది కానీ తమ వద్దకు రాలేదని ఇప్పుడు తాము దేవుని దయతోనే బతుకుతున్నామని, అయితే తమ వారి గురించి తెలియని స్థితిలో ఎందుకు ఉన్నామో తెలియడం లేదని వాపోతున్నారు. పిల్లలు గడ్డకట్టుకుపోతున్నారని, ఓ వైపు భీకర శీతలగాలులు, వచ్చిపడుతున్న మంచుతో పిల్లలు విలవిలలాడిపోతున్నారని , భారీ స్థాయిలో విధ్వంసంతో తాము పిల్లలతో పాటు దిక్కుతోచని స్థితిలో పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమ దిక్కు 6 మీటర్లు జరిగిన టర్కీ

ఇప్పటి పెను భూకంపం ధాటి అంతర్గత పరిణామాలతో టర్కీ ఇప్పుడు పశ్చిమం వైపు సిరియా దిశకు కనీసం 5, 6 మీటర్లు జరిగింది. ఈ పరిణామాన్ని ఇప్పుడు భూగర్భ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. భూమిపొరల్లోని టెక్టోనిక్ ప్లేట్స్ మూడు అడుగుల ఎత్తుకు కలిసిపొయ్యాయి. దీనితో టర్కీ ముందుకు జరిగిందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News