Tuesday, May 7, 2024

కళాకారుడు బల్లేపల్లి మోహన్ పర్యవేక్షణలో కాళేశ్వరంపై పాట

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ (టిసిఎంఎ) అసోసియేషన్ వారు కాళేశ్వరంపై ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో టిసిఎంఎ అధ్యక్షులు, ఖమ్మంకు చెందిన ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు బల్లేపల్లి మోహన్ పర్యవేక్షణలో వెంగి రాసిన ఈ గీతాన్ని భోలే శావలి స్వరపరిచారు.

ఈ కాళేశ్వరం పాటను హైదరాబాద్ రవీంద్రబారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, తెలంగాణ జలమండలి చైర్మన్ వీరమల్ల ప్రకాష్, తెలంగాణ నీటిపారుదల అభివృధ్ది సంస్థ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి సంయుక్తంగా విడుదల చేసారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బల్లేపల్లి మోహన్ పర్యవేక్షణలో ఒక పాట రాయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిసిఎంఎ సంగీత కళాకారులు రవి వర్మ, రమేష్ ముక్కెర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News