Sunday, April 28, 2024

ఇద్దరిది విచిత్ర పరిస్థితి: ఆకాశ్ చోప్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహాలపై మాజీ ఆటగాడు, ప్రముఖ విశ్లేషకుడు ఆకాశ్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. రిషబ్ పంత్‌కు బ్యాటింగ్ బాగానే వచ్చినా కీపింగ్ అంతంత మాత్రమేనన్నాడు. ఇక కీపింగ్‌లో అదరగొట్టే సాహా బ్యాటింగ్‌కు వచ్చే సరికి తేలిపోతాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. రెండు విభాగాల్లో మెరుగ్గా రాణించే వికెట్ కీపర్ ప్రస్తుతం భారత్‌కు అందుబాటులో లేకుండా పోయాడని ఆందోళన వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఎప్పుడూ కీపర్ పాత్ర చాలా కీలకమైందన్నాడు. ప్రతి జట్టులోనూ మెరుగైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారన్నాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత్‌కు టెస్టుల్లో నాణ్యమైన వికెట్ కీపర్ లేకుండా పోయాడన్నాడు. రిషబ్ పంత్, సాహాలకు పలు అవకాశాలు లభించినా ఇద్దరు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేదన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రిషబ్ పంత్ విఫలమయ్యాడన్నాడు. ఇక సాహా కీపింగ్ బాగానే చేస్తున్నా బ్యాట్‌తో జట్టుకు అండగా నిలువలేక పోతున్నాడన్నాడు. ఇప్పటికైన ఇటు సాహా, అటు పంత్ తమ ఆటను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని చోప్రా సూచించాడు.

Aakash Chopra comments on Pant and Saha Fails

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News