Sunday, May 5, 2024

చిన్నారులను చిదిమేస్తున్నారు

- Advertisement -
- Advertisement -
Police Arrests Man for Allegedly Raping Minor
జగిత్యాలలో నాలుగేళ్ల బాలిక.. శంషాబాద్‌లో మైనర్‌పై అమానుషం

హైదరాబాద్: శంషాబాద్ లో మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి అత్యాచార దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించాడు యువకుడు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గోపిగా పోలీసులు గుర్తించారు. తాను అత్యాచారం చేసిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు చేశాడు. నా దగ్గర గన్ ఉంది నీ తల్లిదండ్రులను కాల్చేస్తానంటూ బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో నాలుగేళ్ళ బాలిక పై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అత్యాచార యత్నం చేసిన ఘటనపై బాధిత కుటుంబం జగిత్యాల రూరల్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఆ యువకుడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

Police Arrests Man for Allegedly Raping Minor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News