Sunday, May 12, 2024

సంబంధం మారింది, కలిసే ఉంటున్నాం: విడాకులపై ఆమీర్‌ఖాన్ వివరణ

- Advertisement -
- Advertisement -

Aamir Khan reacts on his Divorce with Kiran Rao

ముంబయి: బాలీవుడ్ జంట ఆమీర్‌ఖాన్(56), కిరణ్‌రావు(47)లు మరోసారి తమ విడాకులపై వివరణ ఇచ్చారు. తాము దంపతులుగా విడిపోయినా ఒకే కుటుంబంలో భాగమన్నారు. మా గురించి మీరు బాధ పడొద్దు అంటూ అభిమానులకు సూచించారు. మేమిద్దరమూ సంతోషంగానే ఉన్నామన్నారు. తమ సంబంధాలు మారినా కలిసే ఉంటున్నామన్నారు. మీరు వేరే విధంగా ఆలోచించవద్దు అంటూ అభిమానులకు హితవు పలికారు. ఆదివారం ఓ వీడియోకాల్‌లో కిరణ్‌రావు చేతిని పట్టుకొని ఖాన్ ఈ ప్రకటన చేశారు. తాము నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ పానీ ఫౌండేషన్ తమ కుమారుడు ఆజాద్‌లాంటిదని ఖాన్ అన్నారు. ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. మేం ఎప్పటికీ ఓ కుటుంబంగానే ఉంటామన్నారు. తాము దంపతులుగా విడిపోతున్నట్టు ఖాన్, రావులు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తమ విడాకులను ముగింపుగా కాకుండా కొత్త ప్రయాణంగా పరిగణించాలని ఆ సందర్భంగా వారు వివరణ ఇచ్చారు. ఖాన్‌కు కిరణ్‌రావుతో రెండో పెళ్లి. ఆయన మొదటి భార్య రీనా దత్తా. వీరికి జునైద్‌ఖాన్, ఇరాఖాన్ అనే ఇద్దరు సంతానం. రీనాకు 2002లో విడాకులిచ్చిన తర్వాత 2005 డిసెంబర్‌లో కిరణ్‌రావును ఖాన్ పెళ్లాడారు. 2011లో వీరికి ఆజాద్ జన్మించాడు. ఖాన్ తాజా ప్రకటనలో ఓ విషయం అస్పష్టంగానే కనిపిస్తోంది. విడాకుల అనంతరం వీరిద్దరూ సహజీవనం(లివింగ్ టుగెదర్) కొనసాగించాలని నిర్ణయించుకున్నారా అన్న దానిపై ఈ ప్రకటన అస్పష్టతనిస్తోంది.

Aamir Khan reacts on his Divorce with Kiran Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News