Tuesday, May 21, 2024

తవ్వేకొద్దీ అక్రమాలు

- Advertisement -
- Advertisement -

ఓ ఐఎఎస్ అధికారికి ఎంఆర్‌ఓ నాగరాజు విలాసవంతమైన ఫాంహౌస్ గిఫ్ట్
 కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఎసిబి 
అక్రమాలకు అడ్డురాకుండా ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో సత్సంబంధాలు 
నాగరాజు లాకర్ల వివరాల సేకరణలో అధికారులు

ACB files Custody petition in Keesara MRO Nagaraju

మన తెలంగాణ/హైదరాబాద్: కీసర ఎంఆర్‌ఒ నాగరాజు కేసులో తవ్వేకొద్ది అవినీతి వెలుగుచూస్తోందని ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో నాగరాజతో పాటు ఇతర నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఎసిబి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా కేసులో దర్యాప్తులో ఓ ఐఎఎస్ అధికారికి ఫార్మ్ హౌస్ డాకుమెంట్స్ వెలుగులోకి రావడంతో ఆ దిశగా ఎసిబి అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈక్రమంలో మీర్‌పేటలో విలాసవంతమైన ఫార్మ్ హౌస్ ఆ అధికారికి సదరు ఎంఆర్‌ఒ నాగరాజు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తేలింది. దీంతో ఫార్మ్‌హౌస్‌కు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు వాటి ఆధారంగా విచారణ జపుతున్నారు. తన అక్రమాలకు అడురాకుండా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంతో నాగరాజు శైలి ప్రత్యేకంగా ఉంటుందని, ఈ క్రమంలో జిల్లా ఉన్నత అధికారులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు గతంలో మేడ్చల్‌లో పనిచేసిన పాలనాధికారికి శామీర్‌పేట్‌లో ఏకంగా ఓ గెస్ట్ హౌస్‌ను గిఫ్ట్ ఇచ్చినట్లు ఎసిబి అ ధికారుల విచారణలో తేలింది.

అ దేవిధంగా ఉన్నతాధికారులతో పాటు కొందరు రాజకీయ నాయకులతోనూ నాగరాజు సంబంధాలు నడిపినట్లు వెలుగు చూసింది. తాను చేసే సెటిల్మెంట్ విలువను బట్టి ఉన్నతాధికారులకు నజరాలు, రాజకీయ నాయకులకు బహుమతులు ఇచ్చిన వైనంపై ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా నాగరాజుకు చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.9 లక్షలు నగదు గుర్తించి సీజ్ చేశారు. నాగరాజుకు చెందిన లాకర్లలో విలువైన భూమి పత్రాలు ఉన్నాయన్న సమాచారంతో వాటి వివరాలను ఎసిబి అధికారులు సేకరిస్తున్నారు.
మరో భూ వివాదం 
కీసర తహశీల్దార్ నాగరాజు మరో భూవివాదంలో చిక్కుకున్నట్లు ఎసిబి విచారణలో వెలుగుచూసింది. కీసర గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 173, 174, 175, 179, 230లో ఉన్న మొత్తం 94 ఎకరాల భూమిని 38 కౌలుదారులకు ఒక్కొక్క కుటుంబానికి 9 ఎకరాల చొప్పున భూమిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ హయాంలోపంపిణీ చేశారు. దీంట్లో 18 ఎకరాల భూమిని రెండు కుటుంబాలు అమ్మకాలు చేశాయి. అయితే భూమిని కబ్జా చేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తమ భూమి తమకు దక్కాలంటూ భూమి ఎదుట బాధితులు గతంలో 40 రోజులు ధర్నాకు దిగారు. ఈ భూమి కోసం బాధితులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టుకేసులో ఉండగా ఎంఆర్‌వొ నాగరాజు భూ మార్పిడి చేసి వేరే వ్యక్తులకు పాస్ బుక్కులు కూడా జారీ చేశాడని ఆరోపణలు చేశారు. భూ మార్పిడి చేయడం వల్లనే హెచ్‌ఎండిఎ అధికారులు వెంచర్ చేయడానికి అనుమతులు ఇచ్చారనివ్యవసాయ భూమిని ప్లాట్ల కోసం భూ మార్పిడి చేశాడని తాసిల్దార్ నాగరాజుపై బాధితులు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపైన ఎసిబి అధికారులు విచారణ చేపట్టారు.
లాకర్లలో నగదు, భూమి పత్రాలు ః ఎంఆర్‌వొ నాగరాజుకు చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.9 లక్షలు నగదు గుర్తించి సీజ్ చేశారు. నాగరాజుకు చెందిన లాకర్లలో విలువైన భూమి పత్రాలు ఉన్నాయన్న సమాచారంతో వాటి వివరాలను సేకరిస్తున్నారు. లంచం కేసులో నాగరాజు సహా, స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్, వీర్‌ఏ సాయిరాజ్‌లను కస్టడీకి కోరుతూ అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

ACB files Custody petition in Keesara MRO Nagaraju

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News