Monday, August 11, 2025

గంజాయి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్ రిమాండ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/తిప్పర్తి : తిప్పర్తి మండల పరిధిలోని గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో అరెస్టు చేసిన సంఘటన చోటుచేసుకుంది. తిప్పర్తి ఎస్‌ఐ వి శంకర్ తెలిపినవివరాల ప్రకారం శనివారం 1.00 గంటల సమయంలో మేడిశెట్టి పరశురాములు (29) కేశరాజుపల్లి, తిప్పర్తి మండలం), మహమ్మద్ షఫీ (BTS, నల్గొండ) గంజాయి వ్యాపారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం అందింది. ఎస్.ఐ. శంకర్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వారి ఆదేశాల మేరకు సిబ్బంది, క్లూస్ టీమ్, పంచుల సమక్షంలో అనిశెట్టి దుప్పలపల్లి గ్రామ శివారులోని ప్రాంతంలో సోదా నిర్వహించారు.సోదాలో మేడిశెట్టి పరశురాములు పట్టుబడగా, అతని వద్ద 2 కిలోల గంజాయి (అంచనా విలువ రూ.50,000/-) స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ షఫీ పరారీలో ఉన్నాడు.

ప్రాథమిక విచారణలో, వీరు హైదరాబాద్ దూల్‌పేట్ నుండి గంజాయి తెచ్చి, చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు తేలింది. స్వాధీనం చేసిన గంజాయిని పంచుల సంతకాలతో సీజ్ చేసి, ఆధారాలుగా నమోదు చేశారు. కేసు NౄPS సెక్షన్ల కింద నమోదు చేసి, అరెస్టయిన నిందితుడిని రిమాండ్‌కు పంపగా, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేస్తున్నట్లు తిప్పర్తి ఎస్త్స్ర శంకర్ తెలిపారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News