Sunday, April 28, 2024

నిశ్చితార్ధంతో షాకిచ్చిన కార్తికేయ..

- Advertisement -
- Advertisement -

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిశ్చితార్ధం చేసుకుని అందరికీ షాకిచ్చాడు యువ హీరో కార్తికేయ. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మధ్య కార్తికేయ నిశ్చితార్థం వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. దీంతో ఓ ఇంటివాడు కాబోతున్న కార్తికేయకు ప‌లువురు సెల‌బ్రిటీలు, అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కాగా, ప్ర‌స్తుతం కార్తికేయ గీతా అర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. అలాగే, కోలివుడ్ లోకి కూడా కార్తికేయ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళ స్టార్ హీరో అజిత్‌ నటిస్తున్న సనిమాలో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Actor Karthikeya engagement photo viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News