Saturday, May 4, 2024

మరోసారి బన్నీతో పూజా హెగ్డే రొమాన్స్..!

- Advertisement -
- Advertisement -

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అగ్ర కథానాయకులతో జోడీ కడుతూ జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ భామ హావా మామూలుగా లేదు. దీంతో రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలో ఛాన్స్ కొట్టేసిన పూజా మరో ఆఫర్ ను అందుకున్నట్లు సమాచారం. ముచ్చటగా మూడోసారి పూజా, బన్నీతో రొమాన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ మూవీ తర్వాత బన్నీ ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఇందులో బన్నీకి జోడీగా మరోసారి పూజా జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘డిజె’, ‘అల వైకుంఠపురం’ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్ ‘పుష్ప’ షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే ‘ఐకాన్’ని షూటింగ్ ప్రారంభించనున్నారు. ‘వకీల్ సాబ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Pooja Hegde to play female lead in ‘ICON’ Film?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News