Sunday, May 5, 2024

పూనమ్ అశ్లీల వీడియోలు…. పోలీసులు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Actor Poonam Pandey detained for shooting ‘obscene’ video

 

పనాజీ: గోవాలోని కనకోనా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డ్యామ్ పై బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే అశ్లీలంగా డ్యాన్స్ చేసినట్టు ఆరోపణలు రావడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతించిన ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పూనమ్ పాండే చాపోలీ డ్యామ్ పై నగ్నంగా డ్యాన్స్ చేస్తానని ఆమె సోషల్ మీడియాలో చెప్పడంతో… 12 చోట్ల ఆమెపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి షూటింగ్ జరుపుకోవడానికి కనకోనా ఎస్ఐ తుకారామ్ చౌహాన్ అనుమతి ఇచ్చాడు. పూనమ్ పాండే షూటింగ్ పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని స్థానిక ఎస్పీ పంకజ్ కుమార్ తెలిపాడు. షూటింగ్ అనుమతించిన ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని మీడియాకు తెలిపాడు. పూనమ్ పాండే అశ్లీల వీడియోలపై గోవాలో ప్రతిపక్ష నాయకుడులు మండిపడుతున్నారు.  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, జలవనరుల శాఖ మంత్రి ఫీలిపి నేరీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకులు దుర్గాదాస్ కామత్, దిగంబర్ కామత్, గోవా ఫార్వర్డ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News