Saturday, May 4, 2024

మళ్లీ బుసలు కొడుతున్న కరోనా మహమ్మారి

- Advertisement -
- Advertisement -

Covid-19 positive cases rise again in Hyderabad

హైదరాబాద్: మహానగరంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రెండునెల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు గత వారం రోజుల నుంచి రోజుకు 280కిపైగా కేసులు నమోదైతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మరోపక్క వైద్యనిపుణులు చలికాలం కావడంతో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఏడు నెలల పాటు వైద్యుల సూచనలు పాటించి ముఖానికి మాస్కులు, వ్యక్తుల మధ్య భౌతికదూరం, బయటకు వెళ్లితే ఎప్పటికప్పడు చేతులకు శానిటైజర్ వినియోగించి వైరస్ దరి చేరకుండా కాపాడుకున్నారు.కానీ వచ్చే మూడునెలలు అత్యంత కీలకమని వరుస పండగలు, వానలు కురువడం చలితీవ్రత ఎక్కువ ఉంటుందనిదీంతో ప్లూ మరింత వేగంగా విస్తరించి ప్రజల ప్రాణాలను హరిస్తుందని డాకర్లు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు జీవించింది ఒక ఎత్తుయితే జనవరి వరకు జీవించేది మరో ఎత్తుని, ప్రజలు దగ్గు,జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలకు వెళ్లి కరోనా టెస్టులు చేసుకుని, పాజిటివ్‌గా తేలితే సకాలంలో వైద్య చికిత్సలు చేయించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలంటున్నారు. మూడు నెల వరకు 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీ దవాఖానలో సిబ్బంది అందుబాటులో ఉండి , లక్షణాలున్న ప్రతిఒకరికి టెస్టులు చేస్తామని ఆరోగ్య కేంద్రాలు అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా హోంఐసోలేషన్ ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామంటున్నారు. గత వారం రోజుల నుంచి కేసులు వివరాలు పరిశీలిస్తే అక్టోబర్ 26వ తేదీన 185, 27న 279కేసులు, 28వ తేదీన 288, గత నెల 29న 293కేసులు, 30వ తేదీన 286, గతనెల 31న 279కేసులు, ఈనెల 1వ తేదీన 256 కేసులు,ఈనెల 2వ తేదీన 281, ఈనెల 3వతేదీన 292 కేసులు,ఈనెల 4వ తేదీన 285 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇకా నుంచి కేసులు పరంపర కొనసాగే అవకాశం ఉందని, మెడిసిన్‌తో వైరస్ తగ్గుతుందని ప్రజలు భావించవద్దని, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయవచ్చని, గత ఏడు నెల నుంచి ప్రజలు ఏవిధంగా బయటకు వెళ్లితే ముఖానికి మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించడం, చేతులను శానిటైజర్‌తో కడగడం వంటివి చలికాలం పోయేవరకు పాటించాలని, వీటిని నిర్లక్షం చేస్తే వైరస్ వేగంగా విస్తరించే వాతావరణం ఎక్కువ ఉంటుందని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా దీపావళి, క్రిస్‌మస్, సంక్రాంతి పండగలతో పాటు పెళ్లి వేడుకలు కూడా ఉండటంతో పరిమిత సంఖ్యలో కార్యాలు చేసుకోవాలని, పెద్ద ఎత్తున చేసుకోవాలనుకుంటే మళ్లీ కరోనాకు రెక్కలు తొడిగినట్లేనని, వైద్యులు సూచించిన సలహాలు పాటించి కరోనా కాటుకు బలికాకుండా కాపాడుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News