Wednesday, May 1, 2024

వైవిధ్యమైన పాత్రలో..!

- Advertisement -
- Advertisement -

Actress Aamani Look released

 

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. బస్తీ బాలరాజుగా హీరో కార్తికేయ ఫస్ట్ లుక్, ఇంట్రో, క్యారెక్టర్ వీడియోతో పాటు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్స్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా సీనియర్ నటి ఆమని లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఆమె వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పక్కన మద్యం బాటిల్ పక్కన పెట్టుకొని గ్లాస్‌లో మద్యం తాగుతూ.. ఆమని వంట చేస్తున్న ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News