Sunday, April 28, 2024

మలేరియాతో ఎక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ… జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

ఏటా సరాసరిన ప్రపంచం మొత్తం మీద 247 మిలియన్ మలేరియా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. వీటిలో చాలా కేసులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉండగా, అతిస్వల్ప కేసులు ప్రాణాంతకమౌతున్నాయి. 2021లో మలేరియా కాటుకు దాదాపు 6,19.000 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన మలేరియా వల్ల ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు వంటి ఎక్కువ అవయవాలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడడం సాధారణం.

Also Read: వచ్చే నెల నుంచి మార్పులివే..

అయితే ఎక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ( aki ) (తీవ్ర మూత్రపిండ గాయం ) అనేది తీవ్రమైన మలేరియా సమస్యగా తెలిసిందే. ఇది దాదాపు 40 శాతం మంది రోగుల్లో సంభవిస్తోంది. పిల్లల్లో దాదాపు 10 శాతం వరకు ఈ కేసులు కనిపిస్తున్నాయి. ఈ ఎక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ చివరకు రోగనిరోధక వ్యవస్థను క్రమబద్ధీకరణ లేకుండా చేయడమే కాక, విశేషమైన వాపు కల్పిస్తుంది. భౌతికంగా, మానసికంగా సమస్యలను తెచ్చిపెడుతుంది. తీవ్రమైన మలేరియా మూత్రపిండాల్లోని మూత్రనాళాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితినే ఎక్యూట్ ట్యూబ్యులర్ నెక్రోసిస్ (acute tubular necrosis) అంటారు. క్రియాటినిన్ అనే వ్యర్థ పదార్ధం పెరిగిపోతుంది.

Also Read: బైజూస్ సిఇఓ రవీంద్రన్ ఇల్లు, ఆఫీసులలో ఇడి సోదాలు

48 గంటల్లో 0.3 మిల్లీగ్రాముల వంతున ఈ క్రియాటినిన్ పెరిగిపోతుంది. ఫలితంగా మూత్ర పరిమాణం 6 గంటల్లో గంటకు కిలోకు 0.5 మిల్లీ లీటరు వంతున తగ్గిపోవచ్చు. మలేరియా వల్ల వచ్చి ఎకెఐని వేగంగా చికిత్స చేయించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ప్రారంభంలో హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, తెల్లకణాలు అధిక సంఖ్యలో ఉండడం, పేట్‌లెట్స్ తక్కువ కావడం, కాలేయం ఎంజైమ్స్ అసాధారణతలు, లవణశాతం నిలకడ లేకపోవడం వంటి తేలికపాటి అసాధారణతలు ఏర్పడవచ్చు . వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఎనీమియా, కాలేయ వ్యాధి, ఎక్యూట్ కిడ్రీ ఇంజ్యురీ, వంటివి ఏర్పడతాయి. ద్రవాలు, వ్యర్థాలు పేరుకుపోవడంతో వంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు పనిచేయడంలో విఫలమైతే, ద్రవాలు వ్యర్థాలు, పేరుకుపోతాయి. లేదా సోడియం, పొటాసియం, వంటి లవణాలకు ఆటంకాలు ఏర్పడతాయి.

Also Read: రాహుల్ గాంధీపై రాంచీ కోర్టు ఇచ్చిన నోటీసుపై జార్ఖండ్ హైకోర్టు స్టే పొడిగింపు!

ప్లీహం చీలిక అన్నది తీవ్రమైన సమస్య. అది ఎకెఐతోపాటు తీవ్రమైన మలేరియాను పిల్లల్లో వ్యాపింప చేస్తుంది. ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మలేరియా తరువాత తీవ్రమైన అనారోగ్య సమస్యగా తయారైన ఎకెఐ తీవ్రతను నివారించడానికి నెఫ్రాలజిస్టుల వైద్యసాయం తప్పనిసరి. ఈ రోగులకు తాత్కాలికంగా డయాలిసిస్ అవసరం అవుతుంది. మలేరియా వల్ల వచ్చే చిక్కులతోపాటు ముఖ్యంగా ఎకూట్ కిడ్నీ ఇంజ్యూరీని నివారించే చికిత్స చేయించుకోవడం తక్షణ అవసరం. మూత్రపిండాల వ్యాధులు సమాజంపై తీవ్ర భారంగా ఉంటున్నాయి. వృద్ధుల్లో 10 శాతం ఏదోఒక కిడ్నీ వ్యాధికి గురవుతుండడం పరిపాటి అయిందని అంచనాలు తెలుపుతున్నాయి.

Also Read: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు..

ఏటా దాదాపు 3,20,000 మంది తీవ్ర మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతున్నారని వీరికి డయాలిసిస్ అవసరమవుతోందని నివేదికల బట్టి తెలుస్తోంది. అయితే అందుబాటులో లేక పోవడం, డయాలిసిస్ రూపంలో లేదా మార్పిడిలో రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకునే స్తోమత అత్యధిక శాతం మందికి ఉండడం లేదు. కిడ్నీకి చాలా ఎక్కువగా నష్టం వాటిల్లినప్పుడు పూర్తి చికిత్స తరువాత కూడా రోగ లక్షణాలు ఎక్కువగా ఉంటే ప్రాణానికి ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు డయాలిసిస్ అవసరం అవుతుంది. పాడైన కిడ్నీ తిరిగి పూర్తి స్థాయిలో పనిచేసే వరకు డయాలిసిస్ అవసరం ఉంటుంది. కిడ్నీ తిరిగి బాగుపడడానికి ఒకటి నుంచి నాలుగు వారాలు పట్టవచ్చు . అంతవరకు డయాలిసిస్ తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News