Sunday, April 28, 2024

మే నెల నుంచి జిఎస్‌టి నిబంధనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు నేరుగా వినియోగదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వం అనేక నియమాలను మార్చబోతోంది. ఇందులో జిఎస్‌టి నియమాలు వంటివి ఉన్నాయి.

జిఎస్‌టి నిబంధనలు
ఇప్పటికే జిఎస్‌టిలోని పలు నిబంధనలను మార్చారు. వ్యాపారులు కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదుని 7 రోజులలోపు ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. మే 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల కోసం వస్తువులు, సేవా పన్నులో ఈ మార్పు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలు ఐఆర్‌పిలో ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News