Saturday, September 21, 2024

ఆకట్టుకుంటున్న 6 స్టన్నింగ్ మూమెంట్స్

- Advertisement -
- Advertisement -

హీరో అడివి శేష్ తన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ గూఢచారి 6వ యానివర్సరీ సందర్భంగా ఫ్యాన్స్ కోసం ట్విట్టర్‌లో థ్రిల్లింగ్ అనౌన్స్‌మెంట్స్ చేశారు. స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. గూఢచారికి సీక్వెల్ గా రూపొందుతున్న జి2 ఫ్రాంచైజీని న్యూ హైట్స్‌కు తీసుకువెళ్లారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ సినిమాని ఇంటర్నేషనల్ స్కేల్ లో చూపిస్తూ ఆరు స్టైలిష్ యాక్షన్ మూమెంట్‌లను రిలీజ్ చేశారు.

జి2లోని ఈ మూమెంట్స్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా నిలిచేవిధంగా స్పై థ్రిల్లర్‌ను చూపిస్తున్నాయి. 2025 సెకండ్ హాఫ్‌లో గ్రాండ్‌గా విడుదల కానున్న జి2 అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రానుంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించారు. శేష్‌తో కలిసి రైటర్ గా కూడా ఉన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. “గూఢచారి సినిమా చాలా ప్రత్యేకమైనది.

గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే వున్నాను. గూఢచారి అభిమానులందరికీ జి2 ఒక మాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుంది”అని అన్నారు. దర్శకుడు సిరిగినీడి మాట్లాడుతూ “సినిమా అద్భుతమైన క్యాలిటీతో వస్తోంది. విజువల్ వండర్ క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టాం. థ్రిల్లింగ్ సెట్ పీస్‌లు, డైనమిక్ యాక్షన్ సీక్వెన్స్ లు ఇలా ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. యాక్షన్ డ్రామా జానర్‌లోని అభిమానులందరికీ ఈ చిత్రం గొప్ప అనుభూతిని ఇస్తుంది”అని తెలిపారు. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ “పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక మైల్ స్టోన్‌గా నిలిచిన ‘గూఢచారి‘ చిత్రం 6వ యానివర్సరీ జరుపుకుంటున్నాము. భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఇటీవలే చిత్రీకరించాము”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News