Tuesday, May 7, 2024

దత్తత తీసుకుని రూపురేఖలను పూర్తిగా మార్చేశా

- Advertisement -
- Advertisement -

మక్తల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ం ఏర్పడిన తర్వాత మక్తల్ నియోజకవర్గంలోని భగవాన్‌పల్లి గ్రామాన్ని తాను ప్రత్యేకంగా దత్తత తీ సుకుని గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చివేశానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా గురువారం మక్తల్ మండలంలోని భ గవాన్‌పల్లిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమ ంలో నారాయణపేట జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కె. వనజ ఆంజనేయులు గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ కార్యాల య భవనం, రూ.16లక్షల వ్యయంతో నిర్మించను న్న సిసి రోడ్ల పనులకు వారు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం కోసం చిన్న మండలాలు, నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలో దాదాపు 15నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు.

ఆయా గ్రామాల్లో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను వెచ్చించామన్నారు. ఒక్క భగవాన్‌పల్లిలోనే రూ.2 కోట్ల 23లక్షల వ్యయంతో వైకుంఠధామంతో పా టు సిసి రోడ్లు, డంపింగ్ యార్డు, పాఠశాల గదుల మరమ్మత్తు, ఇతర పనులను చేశామన్నారు. ఉమ్మ డి రాష్ట్రంలో 60ఏళ్ల పాలనలో భగవాన్‌పల్లికి కోటి రూపాయలను ఖర్చు చేయలేదన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన అనంతరం తాను ప్రత్యేకంగా భగవాన్ పల్లిని దత్తత తీసుకుని నాలుగేళ్లలో అన్ని మౌ లిక సదుపాయాలను కల్పించానన్నారు. త్వరలోనే మరిన్ని నిధులు మంజూరు చేయించి ఆదర్శ గ్రా మంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

పల్లెలకు మహర్దశ.. సిఎం కెసిఆర్ హయాంలో పల్లెలకు మహర్దశ వచ్చి ందని నారాయణపేట జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కె. వనజ ఆంజనేయులు గౌడ్ అన్నారు. గ్రామంలో ఒ కప్పుడు తాగేందుకు నీరు కూడా లేకపోయిందని, కానీ నేడు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ నిధులు రూ.10లక్షలు వెచ్చించి గ్రామంలో సిసి రోడ్లను వేయించానన్నారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స హకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు.

పారిశుద్ధ్య కార్మికులు, వన సహాయకులకు సన్మా నం.. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌లకు గ్రా మస్తులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం ప లికారు. అనంతరం గ్రామంలో పరిశుభ్ర వాతావర ణం నెలకొనేందుకు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులు, పచ్చదనం పెంపొదిస్తున్న వన సహాయకుల ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి జాన్ సుధాకర్, ఎంపిడీఓ శ్రీధర్, ఎం పిపి వనజ, ఎంపిఓ పావని, పిఆర్ ఏఈ లక్ష్మీనారాయణ, ఎంపిటిసి ఆశిరెడ్డి, సర్పంచ్ వెంకట్రాము లు, ఉపసర్పంచ్ బాలచందర్, పంచాయతీ కార్యదర్శి జగదీష్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, నాయకులు కె.గోవర్ధన్‌రెడ్డి, గుర్నాథ్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, నేతాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News