Tuesday, April 30, 2024

కాబూల్‌కు కూతవేటుదూరంలో తాలిబన్లు

- Advertisement -
- Advertisement -
Afghan official says Taliban launch major attack
ఛార్ అస్యబ్ స్వాధీనం… మజర్ ఎ షరీఫ్‌పై దాడి

కాబూల్:  అదును చూసుకుని ఆధిపత్య దిశలో సాగుతోన్న తాలిబన్లు శనివారం దేశ రాజధాని కాబూల్‌కు అతి సమీపంలోని దక్షిణాది ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు. కాబూల్‌కు కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఛార్ అస్యబ్ జిల్లా ప్రాంతానికి చేరుకున్న తాలిబన్లు అక్కడి నుంచి ఉత్తరం వైపు ఉన్న కాబూల్‌పై శనివారం తెల్లవారుజాము నుంచే బహుముఖ వ్యూహాలతో దాడులకు దిగింది. ఈ పరిణామంతో కాబూల్‌లో భయ ప్రకంపనలు మరింత తీవ్రతరం అయ్యాయి. దేశ రాజధాని నుంచి తమ పౌరులను, దౌత్య సిబ్బందిని సురక్షితంగా కాబూల్ నుంచి తరలించేందుకు ఇప్పటికే అమెరికా సేనలు వచ్చాయి. ఈ దశలో కాబూల్‌పై విరుచుకుపడేందుకు తాలిబన్లు మెరుపుదాడులకు దిగుతున్నారు. గత మూడు వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఇప్పటికే దేశంలోని అత్యధిక భాగాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.

ఉత్తర, దక్షణ, పశ్చిమ ప్రాంతాలలో పాగా వేసుకుని బలోపేతం అవుతున్నారు. ఈ నెల 31వ తేదీ గడువుగా అమెరికా సేనలు అన్ని కూడా దేశం నుంచి నిష్క్రమించనున్నాయి. ఇప్పుడు అఫ్ఘనిస్థాన్‌లో నామమాత్రంగానే అమెరికా నాటో దేశాల సేనలు ఉన్నాయి. తాలిబన్లు అత్యంత కీలకమైన కాందహార్, తరువాత లోగర్‌ను ఆక్రమించుకున్నారు. లోగర్‌లో స్థానిక అధికారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇప్పుడు కాబూల్‌కు కేవలం 7 మైళ్ల దూరంలోని ఛార్ అస్యబ్ జిల్లాలో తాలిబన్లు తిష్టవేసుకున్నారని ఈ ప్రోవియన్స్ ఎంపి ఖాలీద్ అసద్ తెలిపారు. శనివారం షరానా తాలిబన్ల బారిన పడింది. ఉత్తర దిశలోని మజర్ ఎ షెరీఫ్ ప్రాంతాన్ని తాలిబన్లు పలు దిక్కుల నుంచి దాడులతో కైవసం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. దీనితో ఈ ప్రాంతంలో భారీ స్థాయి ఘర్షణలు జరుగుతున్నాయని వెల్లడైంది.

అయితే ఈ క్రమంలో ప్రాణనష్టం వివరాలు తెలిసిరాలేదు. బుధవారమే అఫ్ఘన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ మజర్ ఎ షరీఫ్‌కు వెళ్లారు. ఈ ప్రాంతపు భద్రతపై దృష్టి సారించారు. దేశంలో తాలిబన్లకు పోటీగా ఉన్న కొన్ని సాయుధ ముఠాలు క్షేత్రస్థాయి పోరులో దేశ భద్రతా బలగాలకు సహకరిస్తూ వస్తున్నాయి. వేలాది మంది ఫైటర్లతో ఉన్న దళానికి నాయకత్వం వహిస్తున్న అబ్దుల్ రషీద్ దొస్తుమ్, అటా మెహమ్మద్ నూర్‌తో ఇక్కడ అష్రఫ్ కీలక చర్చలు జరిపారు. ఈ సమాచారం అందడంతో దీనిని దృష్టిలో పెట్టుకునే తాలిబన్లు ఇప్పుడు మజర్ ఎ షరీఫ్‌పై బహుముఖ దాడులకు దిగుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News