Monday, April 29, 2024

పట్టు తప్పితే అఫ్ఘన్‌కు దుస్థితే

- Advertisement -
- Advertisement -
Afghanistan is spinning out of control Says UN chief
చిరకాల అశాంతితో అరాచకమే:  ఐరాస

న్యూయార్క్:  అఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి రోజురోజుకీ అదుపు తప్పిపోతోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు వెంటనే తమ ఆక్రమణల పర్వాన్ని నిలిపివేయాలని పిలుపు నిచ్చారు. శాంతిని విచ్ఛిన్నం చేస్తూ బలప్రయోగంతో అధికారం స్థాపించాలనుకోవడం వల్ల దేశానికే నష్టం వాటిల్లుతుంది. అంతర్జాతీయంగా దేశానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ పరిస్థితితో దీర్ఘకాలిక అంతర్యుద్ధ పరిస్థితి ఏర్పడుతుందని, దేశంలో నియంత్రణ లేకుండా పోయిందని, దీనితో తలెత్తేది మరింత అస్థిరత తప్ప అధికారం దక్కించుకోవడంగా భావించుకోరాదని తాలిబన్లను పరోక్షంగా ఐరాస అధినేత హెచ్చరించారు. తరాలుగా అంతర్యుద్థాలు, ఘర్షలతో తల్లడిల్లిన ప్రాంత, మరో మారు కల్లోల స్థితికి చేరడం బాధాకరం అని తెలిపారు.

దిక్కతోచని స్థితితో కూడిన అధ్యాయానికి దేశం చేరుకుంటే అది అందరిని కలిచివేసే అంశం అవుతుందన్నారు. హక్కుల ఉల్లంఘనలు అనివార్యంగా యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని , దీనికి బాధ్యులు ప్రేరకులు, చర్యకు దిగినవారే అవుతారని చెప్పారు. ప్రత్యేకించి మహిళలు, జర్నలిస్టులపై వారి జులుం సాగుతూ పోతోందనే విషయం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరం అన్నారు. ఇటీవలి కాలంలో అఫ్ఘన్ బాలికలు, యువ మహిళలు , స్త్రీలు అతి కష్టం మీద దక్కించుకున్న హక్కులు, వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇటువంటి పరిస్థితి భయానకం అవుతుందన్నారు. దేశంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సాగుతోన్న సంప్రదింపుల పర్వం ఫలిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News