Tuesday, May 21, 2024

ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే

- Advertisement -
- Advertisement -
Afghanistan's Vice President Amrullah Saleh
అఫ్ఘాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ట్వీట్

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు భీతి కొల్పడంతో పాటుగా ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం వదిలిపారి పోవడంతో అపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆఫ్ఘన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం దేశం లోపలే ఉన్నట్లు ప్రకటించారు. అఫ్ఘాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడే ఆ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. అందువల్ల ప్రస్తుతం అధ్యక్షుడిని తానేనని ప్రకటించుకున్నారు. ఏకాభిప్రాయం, మద్దతు కూడగట్టుకునేందుకు నేతలందరినీ కలుస్తానని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News