Sunday, April 28, 2024

వ్యవసాయ వర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించ వద్దు

- Advertisement -
- Advertisement -

జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి:  ఎబివిపి

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయింపు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏబివిపి విద్యార్ధి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అగ్రకల్చర్ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన చేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని కోరారు. అగ్రికల్చర్ వర్సిటీ అంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేయకూర్చి దేశంలోనే అగ్రగామిగా చేసి రైతులకు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగడాలను విత్తనాలను పై పరిశోధన, అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిందన్నారు. అలాంటి వర్సిటీలో 35 సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్స్ వెజిటేబుల్స్ సీడ్స్ ఆ గ్రూప్ ఫారెస్ట్రీ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగి రైతాంగాన్ని పటిష్టం చేయడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతుందన్నారు.

కొత్త సర్కార్ ఆగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి జీవో నెంబర్ 55ను తీసుకరావడం సరికాదన్నారు. యూనివర్సిటీలో దాదాపుగా 100 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకుని ఈ ప్రాంగణంలో ఎలాంటి కట్టడాలు చేపట్టదని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనన్నారు. అదేవిధంగా గ్రామీణ విద్యార్థులు విద్యనుకు దూరం చేసి పరిశోధనలు జరగకుండా ప్రభుత్వం కుట్ర పొందుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని కార్యచరణ రూపొందించి యూనివర్సిటీలో గుంట భూమి కూడా వదలబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News