Tuesday, May 7, 2024

ఆ ప్రభావం ఉండదు

- Advertisement -
- Advertisement -

Aim to win the first Test match:Ajinkya rahane

 

కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీమిండియా కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకున్నా దాని ప్రభావం జట్టుపై ఉండదన్నాడు. తొలి టెస్టులో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా తమ జట్టు సమతూకంగానే ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగడం ఖాయమన్నాడు. ఓపెనర్లుగా మయాంక్, శుభ్‌మన్‌ను దించుతామన్నాడు. ఈ మ్యాచ్ తమకు అనుకున్నంత తేలికేం కాదన్నాడు. అయితే ప్రత్యర్థి జట్టుతో పోల్చితే తామే కాస్త మెరుగైన స్థితిలో ఉన్నామని పేర్కొన్నాడు. ఇక తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరం కావడం జట్టుకు ఇబ్బందికర అంశమేనన్నాడు.

కానీ అతను లేకున్నా అతని లోటును భర్తీ చేసే అస్త్రాలు తమకు అందుబాటులో ఉన్నాయన్నాడు. రాహుల్ స్థానంలో అయ్యర్‌ను తుతి జట్టులోకి తీసుకుంటామన్నాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయన్నాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఇక ఈ మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవడం లేదని రహానె స్పష్టం చేశాడు. టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రహానె మాట్లాడాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News