Monday, May 6, 2024

కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా

- Advertisement -
- Advertisement -
Fake Facebook account in the name of Kukatpally MLA
కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా
ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్: తన పేరుతో ఫేస్‌బుక్ నకిలీ ఖాతా ఓపెన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందజేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరుతో సైబర్ నేరస్థులు ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను ఓపెన్ చేశారు. అంతటితో ఆగకుండా పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడంతోపాటు డబ్బులు పంపించాలని మెసేజ్ పెడుతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్ నర్సింగరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News