Sunday, April 28, 2024

కూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం

- Advertisement -
- Advertisement -

ఇద్దరు పైలట్లు సురక్షితం

కోల్‌కత: భారతీయ వాయు సేనకు చెందిన ఒక శిక్షణ విమానం మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని మెడినిపూర్ జిల్లా కలైకుండలో కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో విమానం కూలిపోయిందని ఆయన చెప్పారు. ప్రమాద కారణాలను కనుగొనడానికి కోర్టు ఆఫ్ ఇంక్వైరీ నియమించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనలో పౌరుల ప్రాణాలకు కాని ఆస్తులకు కాని ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఆయన వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News