Sunday, April 28, 2024

హైదరాబాద్ నుంచి అమెరికాకు విమాన సర్వీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 15న హైదరాబాద్ నుంచి చికాగోకు ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించనుంది. దీంతో తెలంగాణ, ఎపి సహా దక్షిణ భారతదేశ వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. జిఎంఆర్ నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ మేరకు ప్రకటించింది. దీని ప్రకారం 238(8 ఫస్ట్ క్లాస్ + 35 బిజెనెస్ క్లాస్ + 195 ఎకానమీ క్లాస్) సీట్ల సామర్థంలో బోయింగ్ 777200 ఎయిర్ క్రాప్ట్ నగరం నుంచి అమెరికాకు నడవనుంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పానికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌చికాగోలను కలిపే కొత్త నాన్‌స్టాప్ మార్గం విమానాశ్రయం యొక్క కనెక్టివిటీ జాబితాలో కొంతకాలంగా ఉందని తెలిపారు. ప్రతి ఏటా ఏడు లక్షలకు పైగా ప్రయాణీకుల సామర్థంతో హైదరాబాద్‌యూఎస్‌ఎహైదరాబాద్, భారత్‌యూఎస్‌ల మధ్య అతిపెద్ద పాసింజర్ మార్కెట్‌ను కలిగి ఉందన్నారు. హైదరాబాద్ నగరం దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశద్వారంగా ఉన్న సంగతి విదితమే. విశాఖ, విజయవాడ, భువనేశ్వర్, నాగపూర్, భోపాల్, రాజమండ్రి, తిరుపతి నగరాలకు హైదరాబాద్ అనుకూలమైన సామీప్యతను కలిగి ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల నుండి ప్రతి ఏటా సుమారు రెండు లక్షల 20 వేల మంది ప్రయాణికుల అదనపు డిమాండ్ ఉంటుందన్నారు.
కాగా, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం కింద.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు కూడా హైదరాబాద్‌బ్రిటన్‌ను కలిపే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించగా.. ఎమిరేట్స్, ఎతిహాడ్, ప్లై దుబాయ్, ఎయిర్ అరేబియాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వివిధ గమ్యస్థానాలతో హైదరాబాద్‌ని కలుపుతూ తమ సేవలను తిరిగి ప్రారంభించాయి. ఖతార్ ఎయిర్‌వేస్ కూడా హైదరాబాద్‌ను దోహాతో తిరిగి కనెక్ట్ చేసింది.

Air India Services to begin Hyd to US Non Stop flights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News