Thursday, May 2, 2024

రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు

- Advertisement -
- Advertisement -

Ala vaikuntapuramlo

 

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్‌లపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్ (నాన్- బాహుబలి)గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన థాంక్స్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ సినిమాతో ఆల్‌టైం ఇండస్ట్రీ రికార్డు కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక్కొక్కరు ఒక్కో సమయంలో రికార్డు కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు.

తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మేము సినిమా తీశాము… ప్రేక్షకులు చూశారు. మేము తీయడానికి, ప్రేక్షకులు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని ప్రేక్షకులకు చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని, ఎగ్జిబిటర్స్‌ని గౌరవించుకోవడం మా విధి.

‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్ కొట్టినందుకు వారిని సత్కరించాం”అని తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ఇంత ప్రేమగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని పాటల దగ్గర నుంచి ఇక్కడిదాకా నడిపించి ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.రాధాకృష్ణ, తమన్, సుశాంత్, హర్షవర్ధన్, మురళీ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Ala vaikuntapuramlo Thanks Meet at hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News