Sunday, April 28, 2024

డైరెక్షన్ కూడా చేయాలని దేవుడు తలిస్తే నాగశౌర్య చేస్తాడేమో

- Advertisement -
- Advertisement -

Usha Mulpuri

 

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. తాజాగా ఈ చిత్రం విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత ఉషా మూల్పూరి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మంచి స్పందన…
‘అశ్వథ్థామ’ చిత్రానికి వస్తున్న స్పందన చాలా బాగుంది. నాగశౌర్య కెరీర్‌లోనే హయస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి మూడు, నాలుగు వారాలు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. యూత్, కాలేజీ స్టూడెంట్స్ నుండి మంచి స్పందన వస్తోంది.

మాస్ యాంగిల్ నచ్చింది…
ఈ చిత్రం తరువాత కమర్షియల్ చిత్రాలకు నాగశౌర్య కూడా ఒక ఆప్షన్ అయ్యాడు. అతనిలోని మాస్ యాంగిల్ అందరికీ బాగా నచ్చింది. నిజానికి నాగశౌర్య పైకి కనిపించేలా సాఫ్ట్ కాదు. అతను నటించిన సినిమాల వలన క్యూట్ లవ్ బాయ్ ఇమేజ్ వచ్చింది.

కథను బట్టి చేస్తాము…
ప్రస్తుతం కథలు వింటున్నాము. కథను బట్టి సినిమా చేస్తాము. మా బ్యానర్‌లో మా అబ్బాయితోనే సినిమా చేయాలనే నియమం ఏమీ లేదు.
కథలు రాస్తున్న నాగ శౌర్య త్వరలో డైరెక్షన్ కూడా చేసే అవకాశం ఉందా?

ఏదీ అనుకోని జరుగలేదు…
నాగశౌర్య హీరో అవుతాడని మేము అనుకోలేదు. కానీ హీరో అయ్యాడు. ఇప్పుడు రచయిత కూడా అయ్యాడు. ఏదీ అనుకోని జరుగలేదు. ఒకవేళ డైరెక్షన్ కూడా చేయాలని దేవుడు తలిస్తే చేస్తాడేమో.

సక్సెస్ టూర్లు…
సినిమా సక్సెస్ టూర్స్ ఉన్నాయి. నాగశౌర్య ఏలూరు, భీమవరం, విజయవాడలోని కొన్ని థియేటర్లు, కాలేజీలకు వెళ్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సక్సెస్ టూర్లు ఉంటాయి.

Interview with Usha Mulpuri
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News