Sunday, May 5, 2024

నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఈ నెల 20న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో , ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల్లో ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల వయసు గల వారికి అల్బెడజోల్ మాత్రలు మింగించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ అన్నారు.

ఈ నెల 20న నిర్వహించనున్నజాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ పోస్టర్‌ను జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి కృపాబాయి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వీటిని విద్యార్థులకు తినిపిస్తామని తెలిపారు.

1 నుండి 2 ఏళ్ల వారికి నీటితోకలిపి సగం మాత్ర, 2 నుండి 3 ఏళ్ల వారికి నీటితో కలిపి పూర్తి మాత్ర ఇవ్వాలని, మిగిలిన వారికి 400 యంజి మాత్రను వేయాలని సూచించారు. జిల్లాలోని 2,19,500 మంది పిల్లలకు మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లల్లో నులిపురుగుల ప్రభావంతో శారీరక ఎదుగుదల ఉండదని, ఆకలి మందగిస్తుందని, చిరాకు, మతి మరుపు ఉంటుందని తెలిపారు.

వీటి నిర్మూలనకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, పాదరక్షలు ధరించడం, పరిసరాల పరిశుభ్రత ఉండాలని, పండ్లు, కూరగాయలను కడగాలని, ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలని, ఈగలు లేకుండా చూసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కృపాబాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, టీబీ ప్రొగ్రాం అధికారి సుధాకర్ రెడ్డి, ఎన్‌సీడీ ప్రొగ్రాం అధికారి మధుకర్ రెడ్డి, కోఆర్డినేటర్ రాజేష్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News