Sunday, April 28, 2024

నావల్నీ శవాన్ని కూడా దాచిపెట్టారు

- Advertisement -
- Advertisement -

తల్లికి కూడా నిరాకరణే: అలెక్సీ టీం
మాస్కో : తమ అభిమాన నేత అలెక్సీ నావల్నీ మృతి చెందినట్లు ఆయన సహాయక బృందం ఆదివారం నిర్థారించింది. ఇప్పటివరకూ ఆయన మృతదేహం ఎక్కడుంది? ఏ స్థితిలో ఉందనేది తమకు సమాచారం లేదని ఆయన మద్దతుదార్లు తెలిపారు, పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తి అయ్యేవరకూ భౌతికకాయం అప్పగించడం కుదరదని ఆయన తల్లికి అధికారులు తెలిపారు. అయితే కావాలనే ఆయన మృతదేహాన్ని తమకు అధికారులు అప్పగించడం లేదని ఆయన టీం పుతిన్ తీరుపై మండిపడింది. జైలులో మగ్గుతూ నావల్సి కన్నుమూసిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఖండనలు వెలువడ్డాయి.

ప్రత్యేకించి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ రష్యాలో పుతిన్ నిరంకుశ వైఖరి పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు. పై స్థాయి నుంచి అందిన కీలక ఆదేశాలతోనే ఆయనను అధికారులు చంపివేశారని, వీరే హంతకులు అని మద్దతుదార్లు మండిపడుతున్నారు. తమ నేరం వెలుగులోకి రాకుండా సాకులు చెప్పి దర్యాప్తుల పేరిట తమకు అప్పగించకుండా భౌతికకాయాన్ని దాచిపెడుతున్నారని విమర్శించారు. రష్యా అధినేత పుతిన్‌కు అత్యంత బద్ధ విరోధి అయిన రాజకీయ నేత నావల్ని అర్కిటిక్ ప్రిజన్ సముదాయంలోనే శుక్రవారం కుప్పకూలి మృతి చెందినట్లు వచ్చిన వార్తలు నిర్థారణ అయ్యాయి.

కొడుకు శవం అయినా అప్పగించాలని తల్లి ల్యూద్మిలా వేడుకున్నా అధికారులు కుదరదని చెప్పారని ఆయన టీం ప్రతినిధి కిరా యార్మిష్ ఓ ప్రకటన వెలువరించారు. ఆయన తల్లి ఓ లాయర్‌తో కలిసి సలేఖార్డ్ శవభద్ర స్థలానికి వెళ్లారు. అయితే ఇది మూసి ఉంది. ఇక్కడనే నావల్నీ భౌతికకాయం ఉందని ఆమెకు స్థానికులు తెలిపారు. అయితే ఇక్కడ మృతదేహం లేదని , అయినా ఉంటే కూడా దర్యాప్తు తరువాతనే ఎవరికైనా అప్పగించడం జరుగుతుందని ఆయన తల్లికి , లాయర్‌కు ఫోన్లో అధికారులు తెలిపినట్లు కిరా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News