Thursday, May 2, 2024

ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలి: అలీ

- Advertisement -
- Advertisement -

Mahmood Ali

 

హైదరాబాద్: ప్రస్తుత సమయంలో రక్తం ఎంతో అవసరముందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రక్త దానం చేస్తున్న వారందరికీ అభినందనలున్నారు. షేక్ పేటలో రక్తదాన హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపుమేరకు ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో రక్తదాన ఏర్పాటు చేశామన్నారు. కరోనా కట్టడికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది బాగా పని చేస్తున్నారని, తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రూ.1500 పంపిణీ చేస్తున్నామని అలీ వివరించారు. వలస కూలీలను ఆదుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రంజాన్ మాసంలో ముస్లిములు ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలన్నారు.

All muslims are prayer in House in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News