Sunday, April 28, 2024

అల్లు అర్జున్ తో చిందేయనున్న హాట్ బ్యూటీ!

- Advertisement -
- Advertisement -

 

 

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషలల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా యంగ్ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన బన్నీ లుక్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఓ బాలీవుడ్ హీరోయిన్ ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ, హాట్ హీరోయిన్ గా రాణిస్తున్న దిశా పటాని ఈ స్పెషల్ సాంగ్ లో బన్నీ సరసన చిందేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో బన్నీ డ్యాన్స్ కు ఈ హాట్ బ్యూటీ ఫిదా అయినట్లు తెలిపింది. కాగా, పూరి జగన్నాథ్, వరుణ్ దేశ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు తెరకు దిశ పటానీ పరిచమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత దిశ పటానీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

Disha Patani to Special Song with Allu Arjun in PUSHPA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News