Thursday, May 2, 2024

నేటి అఖిలపక్షానికి కెసిఆర్‌కు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి పిలుపు

All party meeting attend by KCR

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగే అఖిల పక్ష సమావేశంలో పా ల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి పిలుపు అందింది. ఈ మేరకు గురువారం సా యంత్రం రాజ్‌నాథ్‌సింగ్ కెసిఆర్‌కు ఫోన్ చేసి నే డు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సింది గా ఆహ్వానించారు. గాల్వనాలో చైనా దాడిపై చర్చించేందుకు  ప్రధాని నరేంద్రమోడీ ఈ అఖిల పక్ష సమావేశా న్ని నిర్వహిస్తున్నారు. గల్వనాలో చైనా సైనికులు మన దేశ సైనికులపై దాడి చేసిన విధానం అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకునే విధంగా చైనాకు తగు రీతిలో బుద్దిచెప్పేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇతర అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష నేతలతో కూలంకషంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ పాల్గొనున్నారు. దేశ రక్షణకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం అండగా ఉంటుందని ఇప్పటికే ప్రధానికి సిఎం కెసిఆర్ స్పష్టంగా సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే అఖిల పక్ష సమావేశంలో ప్రధానికి సిఎం కెసిఆర్ పూర్తి స్థాయిలో అండగా నిలిచేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News