Monday, April 29, 2024

43 కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ మేళాలు

- Advertisement -
- Advertisement -

రానున్న 5 సంవత్సరాలలో
మెజార్టీ జనాభా పట్టణాల్లో పెరిగే అవకాశం
అందుకు అనుగుణంగా పట్టణాల సమగ్రాభివృద్ధ్దిపైన దీర్ఘకాలిక ప్రణాళికలు
మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మునిసిపాలిటీలపై మంత్రి కెటిఆర్ సమీక్ష

LRS in municipalities at Telangana

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కొత్త ఏర్పడిన 43 మునిసిపాలిటీలో ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేల ప్రత్యేకంగా మేళాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. అయితే ఈ అవకాశం కేవలం నూతనంగా ఏర్పడిన మునిసిపాలిటీలు, మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశామని గుర్తు చేశారు. ఈ గడువు సెప్టెంబర్ 30 వరకు ఉన్న నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ అవకాశంపైన విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సంబంధిత అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మునిసిపాలిటీలపైన సదరు జిల్లా మంత్రులు, శాసనసభ్యులతో కలిసి మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదు సంవత్సరాలలో మెజార్టీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉందన్న పట్టణాల సమగ్రాభివృద్దిపైన దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు. ఇప్పటికే భారీ ఎత్తు న జనాభా పట్టణాలలో కేంద్రీకృతమైన నేపథ్యం లో వాటిని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేయాల్సి న అవసరం ఉన్నదన్నారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తీసుకువచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు ఖ చ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలని సూచించారు. కొత్త జిల్లాలుగా ఏర్పడి న నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, స్మశానాల వంటి ప్రాథమిక అంశాలపైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. దీంతోపాటు ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యంకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్లకు, చై ర్మన్లకు ఆదేశాలిచ్చారు.

అలాగే టాయ్‌లెట్లు, పుట్ పాత్ ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలీటీలపైన అభివృద్దికి మంత్రి సూచించిన చర్యలు తీసుకుంటామని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు తెలిపారు. ప్రత్యేకంగా సుదీర్ఘ సమీక్షా సమావేశంపెట్టి పురపాలికల ప్రాధాన్యతలనుపైన సవివరంగా మార్గదర్శనం చేసిన పురపాలక శాఖామంత్రి కెటిఆర్‌కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. ఇలా సూక్ష్మస్ధాయిలో పట్టణాల్లో ఉన్న పరిస్ధితులపై క్షేత్రస్ధాయి చర్చించడం ద్వారా ఆయా పట్టణాల అభివృద్దికి దోహాదం చేస్తుందన్నారు. ఇప్పటికే తమ పరిధిలోని పురపాలికల్లో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపిన మంత్రులు, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పురపాలక శాఖా ఉన్నతాధికారులు, మున్సిపాలిటీల చైర్ పర్సన్‌లు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News