Friday, May 3, 2024

జ్ఞానవాపిపై హైకోర్టు తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్ : వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ఆవరణ సర్వే సంబంధిత వ్యాజ్యంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పును ఆగస్టు 3 వరకూ వాయిదా వేసింది. మసీదు ఆవరణలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనానికి వ్యతిరేకంగా మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతింకెర్ దివాకర్ సారధ్యపు ధర్మాసనం గురువారం మధ్యాహ్నం విచారణ జరిపింది. తీర్పును ఆగస్టు 3 వరకూ వాయిదా వేస్తూ అప్పటివరకూ అక్కడ సర్వే వద్దని ఆదేశించింది.

దేవాలయంపైనే మసీదు నిర్మాణం జరిగిందని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లాయి. దీనితో ఆర్కియాలాజికల్ సర్వే సంస్థ సర్వేతో నిజాలు తేల్చాల్సి ఉందని వారణాసి జిల్లా కోర్టు వెలువరించిన ఆదేశాలను హైకోర్టులో మసీదు కమిటీ సవాలు చేసింది. మసీదు నిర్వహణ సంబంధిత అంజమన్ ఇంతేజామియా దాఖలు చేసిన పిటిషన్‌పై సాగిన విచారణలో హిందూ పక్షం న్యాయవాదులు, ఆర్కియాలాజికల్ సర్వే సంస్థ అధికారులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News