Saturday, April 27, 2024

మద్యం దుకాణాల రిజర్వేషన్ల కేటాయింపులు లక్కీ డిప్ ద్వారా ఎంపిక

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ఎంఎస్ 86 ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం దుకాణాల రిజర్వేషన్లను ఎస్సి, ఎస్టి, గౌడ కులస్తులకు లక్కీ డ్రా ద్వారా కేటాయించినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశాల్లో మద్యం దుకాణాల రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ లక్కి డిప్ ద్వారా చేపట్టారు.

గౌడ కులస్తులకు షాప్ నెంబర్ 15, 29, 39, 35, 42, 36, 12, 40, 62 నెంబర్లు గల 9 మద్యం దుకాణాలను గౌడ కులస్తులకు కేటాయించారు. ఎస్సిలకు కేటాయించిన షాప్ నెంబర్లు 1, 8, 58, 30, 54, 59, 27, 10, 21 నెంబర్లు గల 9 మద్యం దుకాణాలను షెడ్యుల్డ్ కులాలకు కేటాయించారు. ఎస్సిలకు అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతంలోని 64, 65, 66, 67 నెంబర్లు గల 4 మద్యం దుకాణాలు షెడ్యుల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 67 రిటైల్ మద్యం దుకాణాలకు గాను ఏజెన్సీ డివిజన్‌లో ఎస్టిలకు 4, ఎస్సిలకు 9, గౌడ కులస్తులకు 9 మద్యం దుకాణాలు కేటాయించామన్నారు.

మిగతా 45 మద్యం దుకాణాలను జనరల్ కేటగిరికి ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు. మద్యం షాపుల ప్రక్రియను పూర్తి పారదర్శకతతో చేపడతారని, వ్యాపారులు మద్యం దుకాణాల కేటాయింపుపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి షేక్ ఫయాజుద్దీన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్ జి, జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ పర్యవేక్షకులు రాంజి, సహాయ ఎక్సైజ్ శాఖ అధికారి బి. సుధాకర్, సిఐలు ఏడుకొండలు, పరమేశ్వర్ గౌడ్, ఎస్సై జగన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News