Thursday, May 2, 2024

బన్నీ-కొరటాల కాంబినేషన్ లో మూవీ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ మరో క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నాడు. ఇప్పటివరకు అపజయమే ఏరగని దర్శకుడు కొరటాల శివతో బన్నీ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ తెరకెక్కుతుండడగా.. మరోవైపు కొరటాల, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ‘ఆచార్య’ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఈ సమయంలో బన్నీ కోసం కొరటాల సందేశాత్మకమైన కమర్షియల్ ఎంటర్‌టైన్మెంట్ కథాంశంతో స్క్రిప్టు రాసినట్లు సామాచారం. ‘పుష్ప’, ‘ఆచార్య’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బన్నీ-కొరటాల శివల సరికొత్త కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కనుందంటే భారీ అంచనాలే నెలకొంటాయి. వీరి కాంబినేషన్ ఎప్పుడ సెట్ అవుతుందో చూడాలి మరి.

Allu Arjun next movie with Director Koratala Siva?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News