Sunday, April 28, 2024

అల్లు అర్జున్ కార్‌వాన్ కు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Allu Arjun's Caravan gets accident in Khammam

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కార్‌వాన్ వాహనం ప్రమాదానికి గురైంది. శనివారం సాయంత్రం ఖమ్మం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ప్రమాద సమయంలో కార్‌వాన్ వాహనంలో అల్లు అర్జున్ లేడని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల రంపచోడవరంలో పుష్ప మూవీ షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని చిత్రయూనిట్ కార్ వాన్ లో తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కార్‌వాన్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనున్న మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై పుష్ప టీం స్పందించింది. కార్‌వాన్ లో అల్లుఅర్జున్ లేరని, చిత్రయూనిట్ మాత్రమే ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఖమ్మ రూరల్ పోలీస్ స్టేషన్ లో చిత్రయూనిట్ ఫిర్యాదు చేసింది.

Allu Arjun’s Caravan gets accident in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News