Monday, April 29, 2024

అధికార మదం మీకు తలకెక్కింది: తోమర్‌పై ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత మండిపాటు

- Advertisement -
- Advertisement -

భోపాల్: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) మండిపడింది. తోమర్‌కు అధికార మదం తలకెక్కిందంటూ ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రఘునందన్ శర్మ ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి గతంలో బిజెపి తరఫున రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన శర్మ రెండు రోజుల క్రితం తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక పోస్టు పెట్టారు. అందులో జాతీయవాదాన్ని బలపరిచేందుకు తోమర్ కృషి చేయాలంటూ సూచనలు కూడా చేశారు.
నరేంద్ర సింగ్ తోమర్‌ను ఉద్దేశిస్తూ రాసిన ఈ పోస్టులో ఆయన రైతులకు సహాయంపడాలన్నది మీ ఉద్దేశమైనప్పటికీ సహాయం వద్దనుకునేవారు ఉన్నపుడు మంచి చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. నగ్నంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటే వారికి బలవంతంగా దుస్తులు వేసి ఉపయోగం ఏమిటని శర్మ ప్రశ్నించారు. అధికార మదం నేడు మీ తలకెక్కింది. ప్రజాతీర్పును ఎందుకు కోల్పోతున్నారు. కుళ్లిపోయిన కాంగ్రెస్ విధానాలను మనం ఎందుకు తలకెత్తుకోవాలి. చిల్లుపడిన కుండలో నీళ్లు ఉండవు. కుండ ఖాళీ అవుతుంది. అదేవిధంగా ప్రజాతీర్పు కూడా అంటూ రఘునందన్ శర్మ హితవు పలికారు. జాతీయవాదాన్ని బలపరిచేందుకు మీ శక్తులన్నీ ధారపోయాల్సి ఉంటుంది లేకపోతే మనం చింతించాల్సి ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. మన సిద్ధాంతాల పరిరక్షణ ఆవశ్యకతకు ఇదే సూచనగా భావించండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

RSS senior leader slams Minister Tomar over farm laws

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News