- Advertisement -
మనతెలంగాణ/పెద్దపల్లిప్రతినిధి: కరెన్సీపై భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జెరిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. కరెన్సీపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి(సిఎపిఎస్‌ఎస్) ఆధ్వర్యంలో దేశ వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి లక్షమందితో పోస్ట్ కార్డులు పంపిస్తామని, ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పిఐ జాతీయ అధ్యక్షుడు జాన్, ఓబిసి విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షులు కిరణ్, కరెన్సీ అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, చంద్రహాస్, బి.సంపత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -